
కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న ఆయుష్మాన్ భారత్ పధకాన్ని రాష్ట్రంలో అమలుచేయాలని రాష్ట్ర బిజెపి నేతలు కోరినప్పుడు, దానికంటే అన్నివిధాల మెరుగైన ఆరోగ్యశ్రీ ఉండగా అదెందుకని ప్రశ్నిస్తుండేవారు. కానీ ఇప్పుడు తెలంగాణలో కూడా 'ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన' పథకాన్ని అమలుచేసేందుకు సిఎం కేసీఆర్ సిద్దపడ్డారు. దానితో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేసి అమలుచేయాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారు.
ప్రధాని నరేంద్రమోడీ వివిద రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో బుదవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమైనప్పుడు, దానిలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ ఆయుష్మాన్ భారత్ పధకంతో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేసి అమలుచేయాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు.