
చెన్నూరు శాసనసభ్యుడు బాల్క సుమన్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఫైర్ అయ్యారు. ఇవాళ్ళ కరీంనగర్లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తెరాస ఉద్యమం ప్రారంభించినప్పుడు బండి సంజయ్ ఎక్కడున్నాడని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే బిజెపి తెలంగాణశాఖ ప్రారంభించిందన్నారు. కనుక బండి సంజయ్‌కి భాజపా అధ్యక్షుడు పదవి సీఎం పెట్టిన భిక్షేనని బాల్క సుమన్ అభివర్ణించారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ జిల్లా అభివృద్ధికి ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. బండి సంజయ్ సిఎం కేసీఆర్‌ను విమర్శించడం మానుకొని దమ్ముంటే కరీంనగర్‌కు జాతీయ రహదారులు, కాళేశ్వరానికి జాతీయ హోదా తెప్పించాలని డిమాండ్ చేశారు.