తాండూరు మునిసిపల్ సమావేశం రసాభాస

సోమవారం  తాండూరు మునిసిపల్ చైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్నపరిమళ్‌ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. దానిలో అధికార టిఆర్ఎస్‌ సభ్యులే గొడవ పడ్డారు. టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిల మద్య ఎజెండా విషయమై తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. అదే సమయంలో కాంగ్రెస్‌, సిపిఐ, తెలంగాణ జనసమితి ఫ్లోర్ లీడర్లు కూడా ఎజెండాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాని కాపీలను చింపేశారు. దాంతో సమావేశం రసాభాసగా మారింది. ఆ పరిస్థితులలోనే చైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్నపరిమళ్‌ మిగిలిన కౌన్సిలర్ల సహకారంతో ఎజెండాను ఆమోదించి సమావేశాన్ని ముగించారు.