సునీతా లక్ష్మారెడ్డికి కీలక పదవి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మహిళలకు భరోసా కల్పించేందుకు మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలని నిశ్చయించింది.  ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిన్న జారీచేసిన ఉత్తర్వులలో ఒక మహిళా చైర్ పర్సన్, ఆరుగురు సభ్యులు ఉంటారు. వీరి పదవీ కాలం ఆరు సంవత్సరాలుగా ఉండనుంది. తెలంగాణ రాష్ట్ర మహిళా చైర్ పర్సన్ గా సునీత లక్ష్మారెడ్డి నియమించింది.          

సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్ నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాలలో సునీతా లక్ష్మారెడ్డి మంత్రిగా పని చేశారు. ఆమె ఈ ఏడాది మొదట్లో జరిగిన పార్లమెంటు ఎన్నికలకు ముందు సునితా లక్ష్మారెడ్డి హస్తం పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరారు.