సిఎం కేసీఆర్‌ దత్తపుత్రిక పెళ్ళి డిసెంబర్‌ 28న

సిఎం కేసీఆర్‌ దత్తపుత్రిక ప్రత్యూషకు ఈనెల 28న వివాహం జరుగనుంది. హైదరాబాద్‌లోని రాంనగర్‌కు చెందిన ఉడుముల జైన్ మేరీ, మార్రెడ్డి దంపతుల కుమారుడు చరణ్ రెడ్డి ఆమెను ఇష్టపడి పెళ్ళి చేసుకొంటున్నాడు. సిఎం కేసీఆర్‌ కూడా వారి వివాహానికి ఆమోదం తెలుపడంతో ఈ నెల 28న ఉదయం 10 గంటలకు ఆల్వాల్ పరిధిలోగల లూర్ధుమాత చర్చిలో క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ప్రత్యూష, చరణ్ రెడ్డిల వివాహం జరుగనుంది. ముందుగా రేపు అంటే డిసెంబర్‌ 27న బేగంపేటలో గల ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ భవనంలో వారిరువురికీ ప్రధానం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మహిళా శిశుసంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్, ఆ శాఖ అధికారులు హాజరవుతారు. ఎల్లుండి ప్రత్యూష, చరణ్ రెడ్డిల వివాహానికి సిఎం కేసీఆర్‌ దంపతులు హాజరయ్యే అవకాశం ఉంది.