ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ప్రధాన కార్యదర్శి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ఈనెలాఖరుకు పదవీ విరమణ చేయబోతున్నందున ఆమె స్థానంలో ఆదిత్యనాథ్ దాస్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సంక్షేమ పధకాలలో తెలంగాణ సిఎం కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకొని పధకాలు రూపొందించి అమలుచేస్తున్న ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఈవిషయంలో కూడా సిఎం కేసీఆర్‌నే ఆదర్శంగా తీసుకొన్నట్లున్నారు. నీలం సాహ్నీ పదవీ విరమణ చేసిన తరువాత ఆమెను ముఖ్యమంత్రి ప్రధానసలహాదారుగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ నుంచి క్యాడర్ బదిలీ చేయించుకొని ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఐఎఎస్ అధికారిని శ్రీలక్ష్మికి కీలకమైన మునిసిపల్ శాఖకు ముఖ్యకార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.