మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు కరోనా

తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ కరోనా బారిన పడ్డారు. ఈవిషయం ఆయనే స్వయంగా వెల్లడించారు. కరోనా లక్షణాలు కనిపించగానే పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నానని పువ్వాడ తెలిపారు. గత 10-15 రోజులలో తనను కలిసిన వారందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.