తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్‌గా పనిచేస్తున్న ఘంటా చక్రపాణి ఈనెల 17న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో మాజీ ఐపీఎస్ అధికారి నవీన్ చంద్‌ను నియమించాలని సిఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇంటలిజన్స్ విభాగానికి చీఫ్‌గా పనిచేసినప్పుడు మంచి సమర్దుడిగా సిఎం కేసీఆర్ దృష్టిలో పడ్డారు. అందుకే ఇప్పుడు ఆయనను ఈ పదవికి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నవీన్ చంద్ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంత్ రావుకు అల్లుడు. ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావుకు దగ్గర బందువు కూడా. నవీన్ చంద్ నియామకంపై ఒకటి రెండు రోజులలో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.