సిద్ధిపేటపై సిఎం కేసీఆర్‌ వరాల జల్లు

సిఎం కేసీఆర్‌ ఇవాళ్ళ సిద్ధిపేట జిల్లాలో పర్యటించినప్పుడు జిల్లా అభివృద్ధికి పలు వరాలు ప్రకటించారు. ఆ వివరాలు: 

1. జిల్లాలోని రంగనాయక్ సాగర్ మద్యలో ఉన్న 65 ఎకరాలను అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మలిచేందుకు రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సిఎం కేసీఆర్‌ ప్రకటించారు. 

2. జిల్లాలో పొన్నాల నుంచి దుద్దెడ వరకు 22 గ్రామాల చుట్టూ 75 మీటర్లు పొడవున డబుల్ లేన్లు కలిగిన ఔటర్‌రింగ్‌ రోడ్డు నిర్మించడానికి రూ.165 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 

3. సిద్ధిపేట మండలంలోని 4 గ్రామాలకు, గజ్వేల్ నియోజకవర్గాలలోని కొండపాక మండలంలోని రెండు గ్రామాలకు, దుబ్బాక నియోజకవర్గంలోని పది గ్రామాలకు త్రాగునీరు అందించేందుకుగాను మల్లన్నసాగర్ వద్ద కొత్తగా ‘ఇరుకోడు లిఫ్ట్’ ఏర్పాటుకు వెంటనే జీవో జారీ చేస్తానని సిఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు.   

4. సిద్ధిపేట నుంచి ఇల్లెంతకుంట వరకు 25 కిమీ మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. 

5. సిద్ధిపేట పట్టణానికి మరో 1,000 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు మంజూరు. 

6. పట్టణంలో రూ.50కోట్లు వ్యయంతో ఆడిటోరియం నిర్మాణం.  

7.  రూ.25 కోట్లు వ్యయంతో ఇంటిగ్రేటడ్ వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం.  

8. కోమటిరెడ్డి చెరువును అభివృద్దికి మరో రూ.25 కోట్లు మంజూరు. 

9. పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని పట్టణంలో త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు. 

10. హైదరాబాద్‌ తరహాలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు.