
ధరణీ పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్స్ చేయడంపై స్టే విధించినందున మళ్ళీ పాతపద్దతిలోనే రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చునని హైకోర్టు సూచించినందున, వచ్చే వారం నుండి కార్డ్ (కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్) ద్వారా రిజిస్ట్రేషన్స్ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో గత మూడు నెలలుగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్స్ నిలిచిపోయినందున ఇప్పుడు ప్రారంభం కాగానే రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఒత్తిడి పెరిగిపోతుంది కనుక ‘స్లాట్ బుకింగ్’ విధానంతోనే రిజిస్ట్రేషన్స్ చేయాలని అధికారుల సూచనలపై మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కనుక వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు ప్రారంభించబోయేది త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది.