కొత్త కార్పొరేటర్లతో కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో సమావేశం

జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో కొత్తగా ఎన్నికైన 55 మంది కార్పొరేటర్లతో తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో వారికి వారి విధులు, బాధ్యతలు, అధికార పరుదులు, ప్రభుత్వ లక్ష్యాల గురించి కేటీఆర్‌ వారికి వివరించనున్నారు. ఈసారి టిఆర్ఎస్‌ సొంతంగా మెజార్టీ స్థానాలు సంపాదించలేనందున మజ్లీస్‌ పార్టీ మద్దతు తీసుకోవాలా... వద్దా అనే అంశంపై కార్పొరేటర్ల అభిప్రాయాలు తెలుసుకొంటారని సమాచారం. మేయర్, డెప్యూటీ మేయర్ పదవులను దక్కించుకోవడం కోసం అనుసరించాల్సిన వ్యూహాల గురించి వారితో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటువంటి ముఖ్యమైన అంశాలపై పార్టీ అధినేత, సిఎం కేసీఆర్‌ మాత్రమే నిర్ణయం తీసుకొంటారు కనుక ఈ సమావేశం కేవలం వారి అభిప్రాయ సేకరణకే పరిమితమని భావించవచ్చు.