టిఆర్ఎస్‌ మూడో జాబితా విడుదల

ఇవాళ్ళ మధ్యాహ్నం 3 గంటలతో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసిపోతుంది. అయినా పార్టీలు ఇంకా అభ్యర్ధుల జాబితాలను విడుదల చేస్తూనే ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం టిఆర్ఎస్‌ 25 మంది అభ్యర్ధులతో కూడిన 3వ జాబితాను విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 145 మందిని ఖరారు చేసినట్లయింది. జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 డివిజన్లున్నాయి. కనుక మరో 5 మంది అభ్యర్ధులను ఇంకా ప్రకటించవలసి ఉంది. 

పార్టీలు అభ్యర్ధులను ఖరారు చేయడంలో ఆలస్యం అవుతుండటంతో అన్ని పార్టీలలో ఆశావాహులు ముందుజాగ్రత్త చర్యగా నిన్ననే నామినేషన్లు వేశారు. నిన్న ఒక్కరోజే మొత్తం 580 నామినేషన్లు దాఖలయ్యాయి. వారిలో టిఆర్ఎస్‌ నుండి 195 మంది, బిజెపి 140, కాంగ్రెస్‌ 68,  టిడిపి 47, మజ్లీస్ 27, సిపిఎం 4, సిపిఐ 1, ఇతర పార్టీల నుంచి 16, స్వతంత్ర అభ్యర్ధులు 110 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

టిఆర్ఎస్‌ 3వ జాబితాలోని అభ్యర్ధులు...వారు పోటీ చేయబోయే డివిజన్లు 

వెంగళ్‌రావునగర్‌: దేదీప్యారావు; రహమత్‌నగర్‌: సీఎన్‌రెడ్డి; నేరెడ్‌మెట్‌: మీనా ఉపేందర్‌రెడ్డి; ఈస్ట్‌ ఆనంద్‌ బాగ్‌: ప్రేమ్‌కుమార్‌; గౌతమ్‌నగర్‌: మేకల సునీతా రాముయాదవ్‌; గోల్నాక: దాసరి లావణ్య; చందానగర్‌: మంజూల రఘునాథరెడ్డి; 

హైదర్‌నగర్‌: నార్నె శ్రీనివాసరావు; తార్నాక: మోతె శ్రీలత; మౌలాలి: ముంతాజ్‌ ఫాతిమా; ఏఎస్‌రావునగర్‌: పావనిరెడ్డి; చర్లపల్లి: బొంతు శ్రీదేవియాదవ్‌; మీర్‌పేట హెచ్‌బీ కాలనీ: జెర్రిపోతుల ప్రభుదాస్‌; నాచారం: శాంతి సాయిజన్‌ శేఖర్‌;  చిలుకానగర్‌: బన్నాల ప్రవీణ్‌ గీతాముదిరాజ్‌; 

హబ్సీగూడ: భేతి స్వప్నారెడ్డి; ఉప్పల్‌: అరటికాయల శాలినీ భాస్కర్‌ ముదిరాజ్‌; అత్తాపూర్‌: మాధవి అమరేందర్‌రెడ్డి; కాచిగూడ: డాక్టర్‌ శిరీష యాదవ్‌; నల్లకుంట: గరికంటి శ్రీదేవి; అంబర్‌పేట: విజయ్‌కుమార్‌ గౌడ్‌; ముషీరాబాద్‌: ఎడ్ల భాగ్యలక్ష్మీ యాదవ్‌; కవాడిగూడ: లాస్య నందిత; యూసుఫ్‌గూడ: రాజ్‌కుమార్‌ పటేల్; అడిక్‌మెట్‌: హేమలతారెడ్డి.