
దుబ్బాక ఉపఎన్నికలలో ఎదురుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ ఎన్నికలకు ముందు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, ఆయన కుమారుడు రవికుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి బిజెపిలో చేరేందుకు సిద్దమయ్యారు. ఈ సమాచారం అండగానే అప్రమత్తమైన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలను వెంటబెట్టుకొని ఇవాళ్ళ ఉదయం భిక్షపతి యాదవ్ ఇంటికి వెళ్ళి బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన ససేమిరా అనడంతో కాంగ్రెస్ నేతలు నిరాశగా వెనుతిరిగారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో నామినేషన్లు వేసేందుకు ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉన్నందున భిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవ్ తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకొనేందుకు వెంటనే బిజెపిలో చేరిపోయే అవకాశం ఉంది. అభ్యర్ధులు నామినేషన్లు వేయవలసిన సమయంలో నేతలు చేజారిపోకుండా కాపాడుకోవడానికి పరుగులు తీయవలసిరావడం ఏ పార్టీకైనా పెద్ద కష్టమే.