ముగ్గురు ఎమ్మెల్సీల పేర్లు ఖరారు

ఇవాళ్ళ సాయంత్రం ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పేర్లను ఖరారు చేశారు. గవర్నర్ కోటాలో భర్తీ కాబోయే ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ప్రముఖ వాగ్గేయకారుడు, గోరటి వెంకన్న, జాతీయ రజక సంఘం అధ్యక్షుడు బస్వరాజు సారయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను ఖరారు చేసి గవర్నర్‌ ఆమోదం కొరకు పంపించారు. ప్రభుత్వం సూచించిన వారి పేర్లకు గవర్నర్‌ ఆమోదముద్ర వేయడం కేవలం లాంఛనప్రాయమే.