.jpg)
దుబ్బాక ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. మొత్తం 23 రౌండ్లవరకు టిఆర్ఎస్, బిజెపిల మద్య నువ్వానేనా అన్నట్లు పోటీసాగినా చివరికి బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు టిఆర్ఎస్పై 1,470 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. దుబ్బాకలో మొత్తం 1,62,516 ఓట్లు పోల్ అవగా వాటిలో రఘునందన్ రావుకు 62,773, సోలిపేట సుజాతకు 61,302 ఓట్లు, చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 21,819 ఓట్లు పడ్డాయి. దుబ్బాక ఉపఎన్నికలలో బిజెపి విజయం సాధించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకొంటున్నారు. దుబ్బాక తీర్పు సిఎం కేసీఆర్కు ఓ గుణపాఠం వంటిదని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దుబ్బాక ఉపఎన్నికలతోనే రాష్ట్రంలో టిఆర్ఎస్ పతనం ప్రారంభం అయ్యిందని, త్వరలో జరుగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా విజయం సాధించి టిఆర్ఎస్కు మరోసారి తమసత్తా చాటిచెపుతామని అన్నారు.