సంబంధిత వార్తలు

దుబ్బాక ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు జోరుగా సాగుతోంది. మొదటి 5 రౌండ్లలో బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు ఆధిక్యంలో కొనసాగగా, 6, 7వ రౌండ్లలో టిఆర్ఎస్ పుంజుకొంది. 6వ రౌండ్ ఓట్ల లెక్కింపులో బిజెపి కంటే టిఆర్ఎస్ 353 ఓట్లు, 7వ రౌండ్లో 182 ఓట్లు ఆధిక్యం సాధించింది. కానీ మళ్ళీ 8వ రౌండ్లో టిఆర్ఎస్పై బిజెపి 621 ఓట్లు ఆధిక్యం సాధించింది. కనుక 8వ రౌండ్ ముగిసేసరికి బిజెపికి మొత్తం 25,878, టిఆర్ఎస్కు 22,772, కాంగ్రెస్కు 5,125 ఓట్లు గెలుచుకొన్నాయి. దీంతో ప్రస్తుతం బిజెపి టిఆర్ఎస్పై 3,106 ఓట్ల ఆధిక్యంలో ఉంది.