
మధ్యప్రదేశ్‌లో 28 శాసనసభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఈరోజు ఉదయం 8.00 గంటలకు ప్రారంభం అయ్యింది. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో బిజెపి 9 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతుండగా కాంగ్రెస్ ఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉంది.
సుమారు ఏడు నెలల క్రితం మధ్యప్రదేశ్‌లోని అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జ్యోతిరాధిత్య సింధియా ప్రభుత్వాన్ని కూల్చివేసి బిజెపిలో చేరడంతో 25 ఎమ్మెల్యే స్థానాలు ఖాళీ అయ్యాయి. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆరోగ్యసమస్యలతో చనిపోవడంతో వాటితో కలిపి మొత్తం 28 స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి.
మధ్యప్రదేశ్ శాసనసభలో మొత్తం 230 స్థానాలున్నాయి. వాటిలో కాంగ్రెస్ పార్టీకి 87, బిజెపికి 107 స్థానాలున్నాయి. ఈ ఉపఎన్నికలలో బిజెపి మరో 8 స్థానాలు గెలుచుకొంటేనే ప్రభుత్వం ఏర్పాటు చేయగలరు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాలను గెలుచుకొన్నా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండదు కానీ శాసనసభలో దాని బలం మళ్ళీ పెరుగుతుంది.