
మళ్ళీ ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు తిరుగుతుండేవి. అవి నగర ప్రజలకు, పర్యాటకులకు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. చుట్టుపక్కల జిల్లాలలో ప్రజలు డబుల్ డెక్కర్ బస్సులు ఎక్కేందుకే పనిగట్టుకొని హైదరాబాద్ వస్తుండేవారు కూడా. కానీ కాలక్రమన్న అవి కనుమరుగయ్యాయి. మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సులను నడిపించాలంటూ ట్విట్టర్లో షకీర్ హుస్సేన్ అనే ఓ నెటిజన్ చేసిన విజ్ఞప్తిపై మునిసిపల్ మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించడమే కాక వాటితో తనకున్న అనుబంధాన్ని కూడా ఈ సందర్భంగా నెమరువేసుకొన్నారు. ఆ ట్వీట్‌ను రాష్ట్ర రవాణాశాఖ పువ్వాడ అజయ్ కుమార్‌కు ట్యాగ్ చేసి నగరంలో మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సులు నడిపించేందుకు అవకాశం ఉందేమో పరిశీలించాలని మంత్రి కేటీఆర్ కోరారు.