
రెండు పట్టభద్రుల నియోజకవర్గాలలో జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓట్లు వేసేందుకుగాను నవంబర్ 7వరకు పట్టభద్రులు తమ పేర్లను నమోదు చేసుకొనేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం గడువు ఇచ్చింది. కానీ ఆ గడువును డిసెంబర్ 7 వరకు పొడిగించాలంటూ రమేశ్ అనే ఓ న్యాయవాది వేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన హైకోర్టు, ఆ గడువును పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశానుసారం గడువును డిసెంబర్ 1 నుంచి నెలాఖరు వరకు పొడిగిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలియజేసింది. ఇప్పటికే విడుదల చేసిన ముసాయిదా జాబితాపై ఎవరికైనా అభ్యంతరాలుంటే దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. పట్టభద్రుల నమోదుకూ గడువు పొడిగిస్తునందున ఆ ప్రక్రియ ముగిసిన తరువాతే ఎన్నికలు జరుగనున్నాయి.