.jpg)
నిన్న జరిగిన దుబ్బాక ఉపఎన్నికలలో 82.61 శాతం పోలింగ్ నమోదయ్యింది. కరోనా భయం వెంటాడుతున్నప్పటికీ ఓటర్లు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ధైర్యంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓపికగా క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. 11 మంది కరోనా రోగులు కూడా సాయంత్రం 5 గంటల తరువాత పీపీఈ కిట్లు ధరించి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. వారిని ప్రభుత్వ వైద్యసిబ్బంది దగ్గరుండి అంబులెన్సులో పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి ఓట్లు వేయించి తీసుకువెళ్ళారు. దుబ్బాకతో సహా దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలలో 54 శాసనసభ స్థానాలకు కూడా నిన్ననే ఉపఎన్నికలు జరిగాయి. బిహార్ శాసనసభ రెండో దశ ఎన్నికలు కూడా నిన్ననే జరిగాయి. త్వరలోనే మూడో దశ ఎన్నికలు జరుగుతాయి. వీటన్నిటి ఫలితాలు నవంబర్ 10వ తేదీన ప్రకటిస్తారు.