దుబ్బాకలో మధ్యాహ్నం ఒంటిగంటకు 55. 52 శాతం పోలింగ్

దుబ్బాకలో మధ్యాహ్నం ఒంటిగంటకు 55.52 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలియజేసింది. అన్ని చోట్ల పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్‌ భారతీ హోళీకేరి పలు పోలింగ్ కేంద్రాలలో పర్యటిస్తూ పరిస్థితులను స్వయంగా పరిశీలించి ఎన్నికల అధికారులకు తగు సూచనలు ఇస్తున్నారు.