దుబ్బాకలో పోలింగ్ చాలా జోరుగా...ప్రశాంతంగా కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఉదయం 11 గంటల సమయానికి దుబ్బాకలో 34.33 శాతం పోలింగ్ జరిగింది. కరోనా నేపధ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాలలో భౌతికదూరం, అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈసారి దుబ్బాక ఉపఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్, బిజెపిల మద్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనున్నాయి కనుక జిల్లా కలెక్టర్ భారతీ హోళీకేరి, జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు అన్ని పోలింగ్ బూత్‌లలో పరిస్థితులను తెలుసుకొంటూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు. కరోనా భయంతో ఈసారి కాస్త తక్కువ ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నప్పటికీ ఉదయం 11 గంటలకు 34.33 శాతం పోలింగ్ నమోదవడం చూస్తే, పోలింగ్ పూర్తయ్యే సమయానికి (సాయంత్రం 6 గంటలకు) కనీసం 75-80 శాతం పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది.