ములుగు జిల్లాలో ఇద్దరో మావోలు ఎన్‌కౌంటర్

ఈ నెల 10వ తేదీన ములుగు జిల్లాలో వెంకటాపురం(కె) మండలంలోని బోధాపూర్‌ (అలుబాక)లో మావోయిస్టులు టిఆర్ఎస్‌ నేత మాడూరి భీమేశ్వర్‌రావు(బీసు)ను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను ప్రభుత్వం, పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించాయి. దాంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేహౌండ్ దళాలు రంగంలోకి దిగి గత రెండు మూడు రోజులుగా జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట అటవీప్రాంతాలలో మావోయిస్టుల కొరకు గాలిస్తున్నాయి. ముసలమ్మగుట్ట సమీపంలో వారికి నిన్న మావోయిస్టులు ఎదురుపడ్డారు. గ్రేహౌండ్ దళాలు వారిని చుట్టుముట్టినప్పుడు ఎదురుకాల్పులలో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. ఈ విషయం జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్‌ జి. పాటిల్ దృవీకరించారు. జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయి ప్రజలను భయబ్రాంతులను చేస్తూ ప్రభుత్వాస్తులను ధ్వంసం చేస్తుండటంతో వారిని ఏరివేసేందుకు ఈ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాము. చనిపోయిన మావోయిస్టుల వివరాలు తెలుసుకొన్న తరువాత వారి వివరాలు ప్రకటిస్తాము,” అని చెప్పారు.