ఎమ్మెల్సీ ఎన్నికలలో కల్వకుంట్ల కవిత ఘనవిజయం

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ అభ్యర్ధిగా పోటీ చేసిన కల్వకుంట్ల కవిత ఊహించినట్లే ఘనవిజయం సాధించారు. కొద్దిసేపటి క్రితం ముగిసిన ఓట్ల లెక్కింపులో మొత్తం 823 ఓట్లలో ఆమెకు 728 ఓట్లు, బిజెపికి 56, కాంగ్రెస్ పార్టీకి 29 ఓట్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఉపఎన్నికలలో ఆమె ఎమ్మెల్సీగా గెలిచినందున వెంటనే ఆమెకు ఎమ్మెల్సీగా దృవీకరణ పత్రం అందజేయనున్నారు. ఈ నెల 14న జరుగబోయే శాసనమండలి సమావేశంలో ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నారు.