ఈ నెల 28 నుంచి నవంబర్ 7వరకు మూడు దశలలో బిహార్ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక బిహార్‌లో రాజకీయ పార్టీల హడావుడి మొదలైపోయింది. బిహార్‌లో అధికారంలో ఉన్న జేడీయూతో కలిసి బిజెపి ఎన్నికలలో పోటీ చేస్తుండటంతో ఆ రెండు పార్టీలు సీట్లు సర్దుబాట్లు చేసుకొన్నాయి.
మొత్తం 243 సీట్లలో 122 జేడీయూ, 121 సీట్లు బిజెపి పంచుకొన్నాయి. వాటిలో మళ్ళీ తమ మిత్రపక్షాలకు కొన్ని సీట్లు కేటాయించుకొంటాయి. బిజెపి-జేడీయూ కూటమికి మళ్ళీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాయి.
బిహార్‌లో ప్రధాన ప్రతిపక్షం ఆర్జెడీ (లాలూ ప్రసాద్ యాదవ్) పార్టీ నేతృత్వంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఐ-ఎంఎల్, సిపిఐ-ఎం పార్టీలు కలిసి మహాకూటమిని ఏర్పాటు చేసుకొన్నాయి. వాటిలో ఆర్జేడీ-144, కాంగ్రెస్-70, మిగిలిన సీట్లను వామపక్షాలు పంచుకొన్నాయి. ఈ కూటమి బిహార్ మాజీ సిఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్‌ను తమ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించింది.
బిహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు నవంబర్ 10వ తేదీన వెలువడతాయి.