జీహెచ్‌ఎంసీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్లతోటే

వచ్చే ఏడాది జనవరిలో జరుగవలసిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం అప్పుడే అన్ని పార్టీల హడావుడి మొదలైన సంగతి తెలిసిందే. ఈసారి కరోనా భయాల నేపధ్యంలో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లతో నిర్వహించాలని టిఆర్ఎస్‌ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. మిగిలిన పార్టీలు కూడా ఆ ప్రతిపాదనకు అంగీకరించడంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల్ర్లతోనే నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ్ళ సాయంత్రం ప్రకటించింది. బ్యాలెట్ పేపర్లను ముద్రించడం పెద్ద సమస్య కాదు కానీ బ్యాలెట్ బాక్సులను సమకూర్చుకోవడమే కొంచెం కష్టం. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో గల 150 వార్డులలో సుమారు 12,000 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఒక్కో బూత్‌లో కనీసం 3 బాక్సులు అవసరం కనుక 36,000 బాక్సులు అవసరముంటుంది. కనుక ఏపీ, కర్ణాటకల నుంచి బ్యాలెట్ బాక్సులను రప్పించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది.