తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త

తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు ఓ శుభవార్త. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గిపోవడంతో ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మేనెలల్లో జీతాలు, పింఛన్లలో కొత్త విధించవలసి వచ్చింది. ఆ బకాయిలను అక్టోబర్ నుంచి వాయిదాలలో చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.రామకృష్ణారావు బుదవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

పెన్షనర్ల బకాయిలను అక్టోబర్, నవంబర్‌ నెలల్లో రెండు వాయిదాలలో చెల్లిస్తుంది. 

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో ఐఏస్ అధికారులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్, 4వ తరగతి ఉద్యోగులు, కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అక్టోబర్, నవంబర్‌, డిసెంబర్‌ మళ్ళీ జనవరిలో మిగిలిన బకాయిలను (నాలుగు వాయిదాలలో) చెల్లిస్తుంది.     

ప్రభుత్వరంగ సంస్థలు, ఎయిడెడ్ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఇదే విధంగా నాలుగు వాయిదాలలో బకాయిలు చెల్లిస్తుంది.