సిఎం పేషీలోకి శేషాద్రి

సిఎం కేసీఆర్‌ పేషీలో మరో ఐఎఎస్ అధికారి చేరారు. 1999 బ్యాచ్‌కు చెందిన వి. శేషాద్రిని సీఎంఓలో కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఆయన ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్‌గా, టీటీడీ జాయింట్ ఈఓగా, విశాఖపట్టణం, చిత్తూరు జిల్లాల కలెక్టర్‌గా, అర్బన్ ల్యాండ్ సీలింగ్ ప్రత్యేకాధికారిగా పనిచేశారు. ఆయన 2013 నుంచి ఏడేళ్ళపాటు పదోన్నతిపై కేంద్ర సర్వీసులలో పనిచేసి ఇటీవలే రాష్ట్రానికి తిరిగివచ్చారు. రెవెన్యూ, భూవ్యవహారాలపై ఆయనకున్న విశేషానుభవాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎంఓలో సంబందిత శాఖల బాధ్యతలనే అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.