సుమేధ మృతిపై విజయశాంతి స్పందన

సికింద్రాబాద్‌లో నేరేడ్‌మెట్టలోని దీన్‌దయాళ్ నగర్‌లో సుమేధ కపూరియా అనే 12 ఏళ్ళ బాలిక నాలాలో పడి చనిపోవడంపై కాంగ్రెస్‌ మహిళానేత విజయశాంతి ఫేస్‌బుక్‌లో స్పందిస్తూ, సిఎం కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని మీరు చెప్పుకొంటుంటే, వర్షాలు పడితే పొంగిపొర్లే నాలాలలో ఎంతమంది  ప్రాణాలు కోల్పోతున్నారు. అవన్నీ లెక్కలు తీస్తే అదో గిన్నీస్ రికార్డు అవుతుంది,” అంటూ విజయశాంతి ఆక్షేపించారు. టిఆర్ఎస్‌ ప్రభుత్వం గురించి ఏమన్నారో ఆమె మాటలలోనే... 


తమ కుమార్తె మరణానికి జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ సుమేధా కపూరియా తల్లితండ్రులు ఇవాళ్ళ ఉదయం నేరేడ్‌మెట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు.