
రెవెన్యూశాఖలో పేరుకుపోయిన అవినీతిని సమూలంగా ప్రక్షాళన చేసి రైతుల హక్కుల కాపాడాలనే ఏకైక ఉద్దేశ్యంతోనే మూడేళ్ళు కష్టపడి కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించామని సిఎం కేసీఆర్ చెప్పారు. ఈరోజు ఉదయం శాసనమండలిలో కొత్త రెవెన్యూ చట్టానికి సంబందించిన బిల్లును ప్రవేశపెడుతూ, దాని గురించి మండలి సభ్యులకు వివరించారు.
“ఇకపై భూముల క్రయవిక్రయాలు, కొనుగోలుదారుని పేరిట రిజిస్ట్రేషన్, యాజమాన్యహక్కులు బదిలీ (మ్యూటేషన్), తాజా లావాదేవీలకు సంబందించి ధరణి పోర్టల్లో అప్‌డేట్ మొత్తం ప్రక్రియ అంతా కేవలం అర్ధగంటలో ముగుస్తుందని చెప్పారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కేవలం 10 నిమిషాలలో ముగుస్తుందని చెప్పారు. ధరణి పోర్టల్లో నమోదుకాబడిన వివరాలను తహశీల్ధారులు మార్పులు చేర్పులు చేయలేరని, కనుక అవినీతికి అస్కారం ఉండబోదని సిఎం కేసీఆర్ చెప్పారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, రికార్డుల అప్‌డేట్ కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం ఉండదు.. ఎవరికీ లంచాలు ఇవ్వవలసిన అవసరం అసలే ఉండదని సిఎం కేసీఆర్ చెప్పారు.