సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన: జగన్

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జాతీయజెండా ఎగురవేసి 74వ స్వాతంత్ర్య దినోత్సవవేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కులమత, ధనికపేద తారతమ్యాలు లేని సమాజం కోసం ఆనాడు పూజ్య బాపూజీ పరితపించేవారు. ఆయన అడుగుజాడలలో నడుస్తూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాము. పారదర్శక పాలనతో రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం చాలా నిబద్దతతో కృషి చేస్తున్నాము. రాష్ట్రంలో అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చెందేందుకే మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నాము,” అని అన్నారు. ఈ సందర్భంగా గత ఏడాదిన్నర కాలంలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి వివరించారు.