బైరామల్‌గూడా ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్‌

హైదరాబాద్‌ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని గత 5 ఏళ్ళలో నగరంలో కొత్తగా అనేక ఫ్లై ఓవర్లను, అండర్ పాస్‌లను జీహెచ్‌ఎంసీ నిర్మిస్తోంది. తాజాగా బైరామల్‌గూడా చౌరస్తా వద్ద కొత్తగా నిర్మించిన ఫ్లై ఓవర్‌కు సోమవారం ఉదయం మునిసిపల్ మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవం చేశారు. రూ.26.45 కోట్లు ఖర్చుతో ఆరు లేన్లతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ పొడవు 780 మీటర్లు, వెడల్పు 12 మీటర్లు. ఇంతకాలం ఎల్బీ నగర్ నుంచి ఒవైసీ ఆసుపత్రివైపు వెళ్ళేందుకు ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్న వాహనదారులు ఇక రివ్వున దూసుకుపోవచ్చు.