
హైదరాబాద్ నగరంలో సనత్‌నగర్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణపనులకు నేడు మంత్రి కేటీఆర్ శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలోమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, “రూ.68.30 కోట్లతో నిర్మించబోతున్న రైల్వే అండర్ బ్రిడ్జి 12 నెలలో పూర్తవుతుందని భావిస్తున్నాము.
ఫతేనగర్ ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్ పెరుగుతున్నందున ప్రస్తుతం ఉన్న రెండులేన్లకు అదనంగా మరో రెండులేన్లు విస్తరిస్తున్నాము. దీని కోసం రూ.45.04 కోట్లు ఖర్చు చేయబోతున్నాము. ఈ రెండూ పూర్తయితే సనత్‌నగర్, ఫతేనగర్ వద్ద ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది,” అని అన్నారు.
జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత డాక్టర్ సినారాయణ రెడ్డి (సినారె) 89వ జయంతి సందర్భంగా ఇవాళ్ళ బంజారా హిల్స్ లో మంత్రి కేటీఆర్ సినారె ఆడిటోరియం నిర్మాణానికి కూడా శంఖుస్థాపన చేశారు. తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో దీనిని నిర్మించనున్నారు.