.jpg)
రైల్వేశాఖ త్వరలో దేశవ్యాప్తంగా ప్రైవేట్ రైళ్ళను ప్రవేశపెట్టబోతోంది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్లలో కొన్నిటిని ఎంపిక చేసి వాటి ఆవరణలో షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు వగైరా నిర్మించి వాటిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని భావిస్తోంది. దీనికోసం రైల్వేశాఖ ‘ఇండియన్ రైల్వేస్టేషన్స్ దేవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్’ అనే ప్రత్యేక సంస్థను కూడా ఏర్పాటుచేసింది. అది తెలంగాణలో సికింద్రాబాద్, కాచిగూడ, బేగంపేట, లింగంపల్లి, వరంగల్, కాజీపేట, ఖమ్మం, మంచిర్యాల, రామగుండం, భద్రాచలం, మహబూబాబాద్, తాండూరు, వికారాబాద్ స్టేషన్లను ఎంపిక చేసింది. మొదటిదశలో సికింద్రాబాద్, తరువాత కాచిగూడ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు రైల్వేశాఖ సన్నాహాలు ప్రారంభించింది. సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి కోసం ఇప్పటికే టెండర్లు కూడా పిలిచింది. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి అభివృద్ధి పనులు చేపట్టేందుకు రైల్వే అధికారులు సిద్దం అవుతున్నారు.