ఐజీఎస్టీలో హరీష్‌రావుకు చోటు

కేంద్ర ఆర్ధికమంత్రి, వివిద రాష్ట్రాల మంత్రులతో కూడిన జీఎస్టీ మండలి ఇంటిగ్రేటడ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (ఐజీఎస్టీ)లో కొత్తగా ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. బీహార్ ఆర్ధికమంత్రి కన్వీనర్‌గా ఉండే ఆ కమిటీలో తెలంగాణ ఆర్ధికమంత్రి హరీష్‌రావుకు స్థానం కల్పించింది. ఈ మేరకు డిల్లీలోని జీఎస్టీ కార్యాలయం ఓ మెమోరాండం విడుదల చేసింది.