
రాష్ట్రంలో కల్లుగీత కార్మికులను ఆదుకొనేందుకు ప్రభుత్వం హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో అన్ని నగరాలు, పట్టణాలలో కల్లు దుకాణాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో రోడ్డులో రూ. 3 కోట్లు వ్యయంతో ‘నీరా కేఫ్’ నిర్మించబోతోంది. దేశంలోనే ఇది మొట్టమొదటి అతిపెద్ద, ఆధునాతనమైన నీరాకేఫ్ కాబోతోంది. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈరోజు దీనికి శంఖుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొంటారు. ఇంతకాలం సమైక్య రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాలు కల్లుగీత కార్మికుల కష్టాన్ని పట్టించుకోకుండా వారు కట్టే పన్నుల గురించి మాత్రమే ఆలోచించేవారని, కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తూ వారి ఆత్మగౌరవం పెంపొందిస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.