తెలంగాణ సచివాలయం కూల్చివేతపై చెన్నైలో విచారణ!

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై ఓ పక్క హైకోర్టులో విచారణ జరుగుతుండగానే, మరోపక్క చెన్నైలో కూడా ఓ పిటిషన్‌ దాఖలైంది. తెలంగాణ కాంగ్రెస్‌ తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి చెన్నైలో గల నేషనల్ గ్రీన్‌ సిగ్నల్‌ ట్రిబ్యూనల్‌లో ఓ పిటిషన్‌ వేశారు. తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే సచివాలయం కూల్చివేత పనులు ప్రారంభించేసిందని దానిని అడ్డుకోవాలని కోరుతూ రేవంత్‌ రెడ్డి పిటిషన్‌ వేశారు. అయితే ప్రస్తుతం ఇదే వ్యవహారంపై హైదరాబాద్‌ హైకోర్టులో విచారణ జరుగుతున్నందున అది పూర్తయిన తరువాత విచారణ చేపడతామని నేషనల్ గ్రీన్‌ సిగ్నల్‌ ట్రిబ్యూనల్‌ తెలిపి, ఈ కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.     

సచివాలయం కూల్చివేతకు హైకోర్టు అనుమతించినందునే రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేత పనులు మొదలుపెట్టింది. అయితే ఇటువంటి సాంకేతిక కారణాలతో దాఖలైన పిటిషన్ల కారణంగా కూల్చివేతలపై రేపటి వరకు స్టే విధించింది. సచివాలయం కూల్చివేతకు ఎటువంటి ఇబ్బంది లేదనుకొంటే అనూహ్యంగా బ్రేకు పడింది. త్వరలో కూల్చివేత పనులు మొదలుపెట్టి శ్రావణమాసంలోగా శిధిలాలను తొలగించలేకపోతే నూతన సచివాలయం నిర్మాణపనులు మొదలుపెట్టడానికి మళ్ళీ ముహూర్తాలు ఉండవు. అప్పుడు మళ్ళీ దసరా వరకు ఎదురుచూడవలసి వస్తుంది.