
రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలట్‌ను ఆ రెండు పదవుల నుంచి తొలగిస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఆయన తిరుగుబాటు చేసి అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు సిద్దపడటంతో కాంగ్రెస్ ఆయనపై వేటు వేసింది. ఆయనతో చేతులు కలిపిన మరో ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతలపై కూడా కాంగ్రెస్ అధిష్టానం వేటు వేసింది.
సచిన్ పైలట్ తన వెనక 30 మంది ఎమ్మెల్యేలున్నారని సిఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం మైనార్టీలో పడిందంటూ చేసిన్స్ ట్వీట్‌తో కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మొదలైంది. కానీ అశోక్ గెహ్లాట్ చురుకుగా స్పందించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాపాడుకోగలిగారు. దాంతో తిరుగుబాటు చేసిన సచిన పైలట్ ఒకేసారి రెండు కీలక పదవులు కోల్పోయి రాజకీయంగా నష్టపోయారు.
కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై వేటువేయగానే బిజెపి నేత ఓం మాధూర్ చేరవలసిందిగా ఆహ్వానించారు. నిన్నటి వరకు బిజెపిలో చేరబోనని చెప్పిన సచిన్ పైలట్ ఇప్పుడు ఏకాకీగా మారారు కనుక బిజెపిలో చేరే అవకాశం ఉంది.