
పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ వ్రాశారు. కరోనా భయాలు...లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్ధిక ఇబ్బందులలో చిక్కుకొన్న రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలపై భారీగా విద్యుత్ ఛార్జీలు వసూలు చేయడాన్ని తప్పు పట్టారు. వైట్ రేషన్ కార్డులున్నవారికి 100 శాతం కరెంట్ బిల్లులను మాఫీ చేయాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో బిల్లింగులో జరిగిన తప్పులను సరిదిద్ది వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేసిన డబ్బుని తేరిగి ఇచ్చేయాలని కోరారు. లాక్‌డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన సూక్ష్మ, చిన్న, మద్యతరగతి పరిశ్రమలకు కూడా విద్యుత్ ఛార్జీలలో 100 శాతం రాయితీ ఇవ్వాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజల నుంచి బలవంతంగా అధికమొత్తంలో విద్యుత్ చార్జీలను వసూలు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నల్లజెండాలతో కలక్టర్ కార్యాలయాల ముందు ధర్నా చేయబోతున్నట్లు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.