.jpg)
ఘోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ సిబ్బందిలో ఇద్దరు డ్రైవర్లకు, ముగ్గురు గన్మెన్లకు కరోనా సోకినట్లు పరీక్షలలో తేలింది. మరో ఐదుగురి రిపోర్టులు రావలసి ఉంది. దాంతో ఆరోగ్య కార్యకర్తలు వారందరినీ క్వారెంటైన్‌కు తరలించారు. వారందరితో రాజాసింగ్ సన్నిహితంగా ఉంటారు కనుక ఆయనను, కుటుంబ సభ్యులను కూడా హోమ్ క్వారెంటైన్లో ఉండవలసిందిగా సూచించి, కరోనా పరీక్ష కోసం వారి రక్తం నమూనాలు తీసుకొన్నారు. ప్రజాప్రతినిధులు కూడా నిత్యం ఏవో ఓ కార్యక్రమాలలో పాల్గొంటూనే ఉంటారు ఆ సందర్భంగా రోజూ చాలా మందిని కలుస్తూనే ఉంటారు కనుక వారికి కూడా కరోనా సోకే అవకాశాలు ఎక్కువున్నాయి. ఆవిధంగానే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముట్టిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, బీగల గణేశ్ గుప్తా, సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావులకు కరోనా బారినపడ్డారు. బహుశః ఇప్పుడు రాజాసింగ్ కూడా ఆ జాబితాలో చేరుతారేమో?