
తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వినోద్ కుమార్ సింగ్(వీకే సింగ్) తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను కేంద్రహోంమంత్రి అమిత్ షాకు ఈమెయిల్ ద్వారా పంపించారు. ఆయన తెలంగాణ డిజిపి పదవి ఆశిస్తున్నారు. కానీ ఇదివరకు ఆయన ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే కొన్ని విమర్శలు చేయడంతో 33 ఏళ్ళ సీనియారిటీ ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆయన పేరును డిజిపి పదవికి పరిగణనలోకి తీసుకోలేదు. తనకు డిజిపి పదవి చేపట్టేందుకు తగినంత అనుభవం, అర్హతలు అన్ని ఉన్నాయని కనుక తనకు అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతూ గత నెల 21వ తేదీన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌కు ఓ లేఖ కూడా వ్రాశారు. ఆ లేఖ కాపీనీ సిఎం కేసీఆర్ కూడా పంపించారు. దాంతో కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో తన పదవికి రాజీనామా చేశారు. వీకే సింగ్‌ను సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. తన రాజీనామా ఆమోదం పొందిన తరువాత తన పూర్తి సమయం సామాజిక సేవా కార్యక్రమాలకే వినియోగిస్తానని వీకే సింగ్ చెప్పారు.