యూపీలో 15 జిల్లాల సరిహద్దులు మూసివేత

ఇక యూపీలో కూడా కరోనా విజృంభిస్తున్నందున యోగీ ఆధిత్యనాథ్ ప్రభుత్వం బుదవారం అర్దరాత్రి నుంచి ఈనెల 13వరకు రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న 15 జిల్లాలను పూర్తిగా మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుంచి ఆ 15 జిల్లాలలో లాక్‌డౌన్‌ మరింత కటినంగా అమలుచేయాలని ఆదేశించారు. ఆ జిల్లాలో ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులన్నీ ఇళ్ళవద్దకే తెచ్చి అందిస్తామని యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. లాక్‌డౌన్‌ ప్రకటించిన జిల్లాలలో వారణాసి, కాన్పూర్, లక్నో, ఆగ్రా, బరైలీ, ఘజియాబాద్, ఫిరోజాబాద్, మీరట్, షామ్లి, సీతాపూర్, మహరాజ్ గంజ్, నోయిడాలోని గౌతమ్‌బుద్ నగర్, బులంద్ షహర్, షహ్రాన్‌పురాబస్తీ తదితర ప్రాంతాలున్నాయి.  

యూపీలో ఇప్పటివరకు 361 కేసులు నమోదుకాగా నలుగురు కరోనాతో మృతి చెందారు. యూపీలో ముస్లిం జనాభా చాలా ఎక్కువే కనుక సుమారు 1,600 మందికి పైగా డిల్లీ మర్కజ్‌ సమావేశాలతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబందం కలిగి ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం వారందరినీ క్వారంటైన్‌లో ఉంచి కరోనా పరీక్షలు నిర్వహింపజేసింది. వారి రిపోర్టులు ఇంకా రావలసి ఉన్నందున రాష్ట్రంలో కరోనా వ్యాపించకుండా 15 జిల్లాలను పూర్తిగా మూసివేసింది.