మార్చి 6 నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు

మార్చి 6వ తేదీ నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి. తెలంగాణ గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్‌ తొలిసారిగా మార్చి 6న ఉభయసభల సభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగించనున్నారు. మరుసటిరోజున గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఉంటుంది. ఆదివారం, హోలీ పండుగ వరుసగా రావడంతో మార్చి 8,9 తేదీలలో శాసనసభ సమావేశాలు జరుగవు. 

మార్చి 10వ తేదీన మళ్ళీ శాసనసభ సమావేశమైనప్పుడు రాష్ట్ర ఆర్ధికమంత్రి హరీష్‌రావు 2020-21 ఆర్ధిక సం.లకు సంబందించి రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. మార్చి 25వరకు మొత్తం 13 పనిదినాలలో శాసనసభ సమావేశాలు జరుగుతాయి. శాసనమండలి మాత్రం గత ఏడాదిలాగే ఈసారి కూడా కేవలం నాలుగురోజులే సమావేశమవుతుంది. కనుక అవి ముగిసేలోగానే సీఏఏను వ్యతిరేకిస్తూ ఉభయసభలలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉంది.