నాంపల్లి కోర్టుకు కవిత

టిఆర్ఎస్‌ మాజీ ఎంపీ కవిత నేడు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. పదేళ్ళ క్రితం జరిగిన నిజామాబాద్‌ ఉపఎన్నికల సమయంలో ఆమె పార్టీ కార్యకర్తలతో కలిసి నిజామాబాద్‌ ఎస్పీ కార్యలయం ఎదుట ధర్నా చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ధర్నా చేసి ఎన్నికల నియామవళి ఉల్లంఘనకు పాల్పడినందుకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు ఐపీసీ 341, 188 సెక్షన్ల కింద కవిత మరికొందరిపై కేసులు నమోదు చేశారు. పదేళ్ళ క్రితం నమోదు అయిన ఆ కేసుపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరుగనుంది. దానికే కవిత హాజరుకానున్నారు.  

తాజా సమాచారం: 

కొద్ది సేపటి క్రితమే కవిత నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా పడింది. నాంపల్లి కోర్టుకు కవిత వస్తున్నట్లు తెలియడంతో అక్కడకు టిఆర్ఎస్‌ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకోవడంతో వారిని అదుపు చేయడానికి పోలీసులు చాలా ఇబ్బంది పడ్డారు.