1.jpg)
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మళ్ళీ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు సన్నిహితుడైన మైహోం సంస్థ అధినేత రామేశ్వర్రావుకు రాష్ట్ర ప్రభుత్వం రాయదుర్గం వందల కోట్ల విలువైన భూమిని తక్కువధరకు కట్టబెట్టడమే కాకుండా నిబందనలకు విరుద్దంగా రూ.38 కోట్ల స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చిందని రేవంత్ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. దానిని విచారణకు స్వీకరించిన హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వానికి, మైహోం రామేశ్వర్రావుకు, డీఎల్ఎఫ్ సంస్థకు హైకోర్టు నోటీసులు జారీ చేసి ఈ కేసు తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. ఒకవేళ రేవంత్ రెడ్డి బలమైన ఆధారాలతో తన ఆరోపణలు నిజమని నిరూపించగలిగితే ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసిరావచ్చు. ఒకవేళ రేవంత్ రెడ్డి తన ఆరోపణలను నిరూపించలేకపోతే కోర్టులో ఆయనకు చీవాట్లు, తలఒంపులు తప్పకపోవచ్చు. దీనిపై టిఆర్ఎస్ నేతలు ఇంకా స్పందించవలసి ఉంది.