
తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో జిల్లాకు ఒక కలక్టర్, ఒక జాయింట్ కలక్టర్ ఉండేవారు. అయితే జిల్లా స్థాయిలో కూడా సమర్ధమైన పాలన సగాలంటే ప్రతీ జిల్లాకు ఒక కలక్టర్, ఇద్దరు అదనపు కలక్టర్లు అవసరమని సిఎం కేసీఆర్ భావించారు. కనుక డీఆర్ఓ, జాయింట్ కలక్టర్లకు అదే జిల్లాలో అదనపు కలక్టర్లుగా మొత్తం 49 మందికి పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు అదనపు కలక్టర్లు ఎప్పటిలాగే జిల్లాకలక్టర్ అధ్వర్యంలో పనిచేస్తారు. రేపు ప్రగతి భవన్లో సిఎం కేసీఆర్ కలక్టర్లతో సమావేశం కానున్నారు. ఆ సమావేశంలో అదనపు కలక్టర్లకు ఎటువంటి బాధ్యతలు అప్పగించాలనేదానిపై చర్చించి నిర్ణయం తీసుకొంటారు.