
దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా సికింద్రాబాద్లోని రైల్నిలయంలో మీడియాతో మాట్లాడుతూ, “కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించింది. మౌలికవసతుల కల్పనకు రూ.6,846 కోట్లు, బైపాస్, డబ్లింగ్ పనులకు రూ.3,836 కోట్లు, నడికుడి-శ్రీకాళహస్తి మద్య కొత్త ప్రాజెక్టుకు రూ. 1198 కోట్లు, భద్రాచలం-సత్తుపల్లి మద్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు రూ. 520 కోట్లు, కాజీపేట-బళ్లార్షా మద్య 3వ లైన్ ఏర్పాటుకు రూ. 483 కోట్లు, మునీరాబాద్- మహబూబ్నగర్ మద్య కొత్త లైన్ ఏర్పాటుకు రూ. 240 కోట్లు, మనోహరాబాద్-కొత్తపల్లి మద్య కొత్త రైల్వేలైను కోసం రూ.235 కోట్లు, ఎంఎంటిఎస్ 2వ దశ పనులకు రూ. 40 కోట్లు, విశాఖ రైల్వే జోన్కు 140 కోట్లు కేటాయింపులు జరిగాయి.
ఇప్పటికే కొన్ని ప్రధాన నగరాల మద్య ప్రైవేట్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ ఆర్ధిక సం.లో ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాలలో మరో 11 ప్రైవేట్ రైళ్లు ప్రారంభించే అవకాశం ఉందని గజానన్ మాల్యా తెలిపారు.
చర్లపల్లి-వారణాసి, చర్లపల్లి-పర్వేలి, చర్లపల్లి-శాలిమార్, చర్లపల్లి-చెన్నయ్, లింగంపల్లి-తిరుపతి, లింగంపల్లి-గుంటూరు, సికింద్రాబాద్-గౌహతి విజయవాడ-విశాఖపట్టణం, ఔరంగబాద్-పన్వెలి మద్య ప్రైవేట్ రైళ్ళు ప్రారంభం కావచ్చునని తెలిపారు.