12.jpg)
ఈనెల 11న సిఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఉదయం 11 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశంకానున్నారు. రెండు రోజుల క్రితమే రాష్ట్రంలో జిల్లా కలక్టర్లతో సహా వివిద శాఖలకు చెందిన ఐఏస్ అధికారుల బదిలీలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం అవడంతో పట్టణాలలో కూడా పట్టణ ప్రగతి పేరుతో అటువంటి కార్యక్రమం నిర్వహించాలని సిఎం కేసీఆర్ భావిస్తున్నారు. కనుక ఈ సమావేశం దాని గురించి చర్చించబోతున్నట్లు సమాచారం. ఈనెల 15న రాష్ట్రంలో సహకార సంఘాలకు ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. కనుక ఈనెల 11న జరుగబోయే సమావేశం చాలా కీలకమైనదేనని భావించవచ్చు.