మేడారం టూరిస్ట్ బస్ ప్యాకేజి వివరాలు

మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు అప్పుడే రాష్ట్రం నలుమూలల నుంచి రోజూ లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. నిన్న ఆదివారం ఒక్కరోజే సుమారు 10 లక్షల మంది భక్తులు వచ్చినట్లు అంచనా. బుదవారం నుంచి జాతర మొదలవుతుంది కనుక భక్తుల రద్దీ ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది. కనుక హైదరాబాద్‌ నుంచి వెళ్ళే భక్తుల సౌకర్యం కోసం రాష్ట్ర పర్యాటకశాఖ ప్రత్యేక ప్యాకేజీని సిద్దం చేసింది.

ప్రతీరోజూ ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌లోని యాత్రీనివాస్ నుంచి, 6.15 గంటలకు బషీర్ బాగ్ వద్దగల సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం నుంచి మేడారంకు ప్రత్యేక వోల్వో బస్సులు బయలుదేరుతాయి. తిరుగు ప్రయాణంలో వరంగల్‌లోని వేయిస్థంభాల గుడిని కూడా చూపించి మళ్ళీ రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్‌ చేరుకొంటాయి. వోల్వో ఏసీ బస్సులలో పెద్దలు ఒక్కొక్కరికీ రూ.1,500, పిల్లలకు రూ.1,200 ఛార్జీలుగా నిర్ణయించారు. నాన్ ఏసీ బస్సులలో పెద్దలు ఒక్కొక్కరికీ రూ.1,000, పిల్లలకు రూ.800 ఛార్జీలుగా నిర్ణయించారు. వీటిలో టికెట్స్ ముందుగా ఆన్‌లైన్‌లో రాష్ట్ర పర్యాటక శాఖ వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు:  

సికింద్రాబాద్‌ యాత్రి నివాస్‌: 040-27893100, 9848126947

పర్యాటక భవన్‌: 040-23414334, 9848306435

కూకట్‌పల్లి: 040-23052028, 9848540374

దిల్‌సుఖ్‌నగర్‌: 9848007020

ట్యాంక్‌బండ్‌: 040-23450165, 9848125720

శిల్పారామం: 040-23119557, 9666578880

బషీర్‌బాగ్‌ సీఆర్‌ఓ కార్యాలయం: 040-29801039, 040-29801040, 9848540371