
రాష్ట్రంలో 906, ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు రాష్ట్ర సహకారశాఖ ఎన్నికల ఆధారిటీ గురువారం ఎన్నికల షెడ్యూల్ జారీ చేసింది. ఫిబ్రవరి 3వ తేదీన జిల్లాలవారీగా ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటిస్తారు. ఫిబ్రవరి 6 నుంచి 8వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 9న పరిశీలన, 10వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 15న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు నిర్వహించి అదేరోజు సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తారు. వరంగల్ జిల్లాలో ఒకటి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక సహకార సంఘాలకు ఇంకా ఆగస్ట్ నెలాఖరువరకు కాలపరిమితి ఉన్నందున ఆ రెంటికీ ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడంలేదు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాలోని 904 సంఘాలకు ఫిబ్రవరి 15న ఎన్నికలు నిర్వహించబడతాయి.